21 September 2010

తరుణోపాయం - ఒక “సత్తా” కి నా సమాధానం

ఈ మహా నగరం లో చాలా ముఖ్యమైన ప్రదేశం హైటెక్ సిటి, ఎటు చూసినా ప్రపంచ పటంలో చాలా చోట్ల కనిపించే పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు, అందులో పని చేసే ఉద్యోగులు సమయం నిమిషాల్లో కంటే సెకన్ లలోనే పాటిస్తారు...   అలాంటి చోట నాకు ఒక వ్యాపారం చెద్దాము అనే ఆలోచన వచ్చింది...
ప్రతి రోజు మామూలుగా ఆఫీసు కి వెళితే పట్టే సమయం కె పి హెచ్ బి నుండి హైటెక్ సిటి కి ద్విచక్ర వాహనం పైన 20నిమిషాలు , కార్ లో 30నిమిషాలు. కానీ చిరుజల్లు భూమాతను స్పృశిస్తే అప్పుడు బైక్ పైన 40 నిమిషాల నుండి గంట , కార్ లో గంట నుండి గంటన్నర. ఇక్కడ అసలు సమస్య చెప్పాలి, హైటెక్ సిటి రైల్వే స్టేషన్ దగ్గర చిన్న వంతెన వుంది రైలు వెళ్ళటానికి. దాని కింద నుండి వాహనాలు వెళ్లాలి. అంటే రైలు మార్గం దానికి కింద రోడ్ మార్గము రెండు వున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రయాణ మార్గము కావాలి.
అదే జలమార్గము...  ఎందుకంటే అక్కడ చిరు జల్లుకే ఒక చిన్న కాలువ ప్రవహిస్తుంది, అదే కొద్దిగా తేలికపాటి వర్షానికి చిన్న చెరువులా మారిపోతుంది... ఇటు వెళ్ళటానికి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు... వారి వాహనాలు పాడవకుండా వారు ఇంకా వేరే మార్గాల్లో వెళ్ళి సమయం వృధా చేసుకోకుండా నాకు ఒక ఆలోచన వచ్చిoది. దానిని ఆచరణ లో పెడితే వారికి నాకు కూడా సమయం ఆదా చేసిన వాడిని  అవుతాను. ఇంకా చాలా మందికి ఒక కొత్త అనుభూతిని మిగిల్చిన వాడిని అవుతాను...
అదే బల్లకట్టు... ఇక్కడ ఒక బల్లకట్టు పెడితే వర్షానికి ఆ దారి చెరువు అయినప్పుడు అక్కడ ఆ బల్లకట్టు సహాయంతో వాహనల్ని అందులోని మనుషులని అవతలి తీరానికి చేర్చవచ్చు... 
మొన్న పొద్దున అటు వస్తూ నేను ఒక పోస్టర్ చూసాను,


ఈ రోడ్ బాగు చెయ్యటా నికి, ముందుకు వచ్చిన  కె పి హెచ్ బి ఎం ల్  ఏ గారికి ధన్యవాదములు అని,  ఐనా ఆ రోడ్ బాగు చేయించిన తరువాత ఆ ధన్యవాదములు చెప్పాలి కానీ సమస్యని చూడటానికి వచ్చిన వాళ్ళకి కూడా  ధన్యవాదములు చెపుతారా?  


ఆ ఎం ల్  ఏ గారికి ఇన్ని రోజులు ఇటు తిరిగి చూడాలని అనిపించలేదా?   


వర్షానికి ఆతలాకుతలం అవుతుంటే పట్టని వారికి ఈ వర్షాకాలం ఇంకో నెలలో అయిపోతుంటే ఇప్పుడు ఇంత శ్రద్ద ఏమిటో!!!             

05 September 2010

ఈ క్షణం నా మనసు...

నీ చేయి అందించు – చిమ్మ చీకటి లో ఐనా ఒక కిరణం లా మెరుస్తాను
నీ స్నేహాన్ని అందించు – సప్త సముద్రాలూ అవలీలగా దాటి వస్తాను
నీ మనసులో స్థానం ఇవ్వాలే కానీ ఈ జగమంతా రాజునై ఎదురు లేకుండా ఏలుతాను….



అదంతా ఒకప్పుడు.....



విధి విలాసమో ఏమో , వెచ్చటి దుఖం తో బంధనాలు తెంచమని అడిగినా బదులు ఇవ్వని దేవుడు,

స్నేహితులు లేరు , ప్రేమ లేదు, బంధువులు లేరు

మరి గుండె గోడ కింద మంటల సెగలు ఆపేదెవరు,



మరి ఇప్పుడు ----

సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అన్న ఒక మహేనీయుడి చివరి అడుగు నా ప్రస్థానం లో మొదటి అడుగు



ఈ సమాజం ఒక అద్భుతం

అందులో నేనొక సూక్ష్మాన్ని, యాత్రికుడిని, సమస్యని, అంతాన్ని, అంతరాలు తెలిసినా కూడా మనసు నిలకడగా లేదు...



కోపమెందుకు ప్రేమతో జయించు అన్నారు, కానీ ఆ ప్రేమ మీదే నమ్మకం లేనప్పుడు ఆ ప్రేమ వల్ల కొందరు జీవితాలే కోల్పోతున్నప్పుడు, ఆ ప్రేమ తో దేనిని జయించాలి ఈ బ్రష్టు పట్టిన సమాజంలో,

దీనికి సమాధానం బాంబు దాడిలో చనిపోయిన అమాయకుల కుటుంబాలను అడగాలా?

లేక యాసిడ్ దాడిలో గాయపడిన ప్రణీత ను అడగాలా?

కిరాతకుల చేతిలో బలయిన చిన్నారి నాగ వైష్ణవినా లేక చిన్నారి మృతిని తట్టుకోలేక మృతి చెందిన తండ్రి ప్రభాకర్ నా?







మగవాడి మనసు...

మగవాడి మనసు మగువ మనసు లాగా సున్నితం కాదా?

మరపు అంటే ఏమిటో తెలియని అటువంటి మనసులతో మగువలకు ఎందుకు ఈ ఆటలు

తాను ప్రేమించిన పడతి పలకరిస్తేనే తమ మనసులు పులకరించి పోతాయే

ఆమె దరహాసానికి దాసోహం అంటారే,మరి అటువంటి వాళ్ళని ఇప్పుడు తప్పు చేశారు అంటున్నారు, ఏమి తప్పు చేశారు?

నీ అనుమతి లేకుండానే నీ ఆధారాలను అంటి పెట్టుకున్నాడా?

లేక నీకు తెలియకుండానే నీ శరీరం లో అణువణువు అర్పించావా?

కన్నవాళ్ల కళ్లుగప్పి తన కౌగిట్లో బందీ అయ్యినప్పుడు తెలియదా నువ్వు తప్పు చేశావని?

అన్న కు అబద్దం చెప్పి తన ఆతిధ్యం కోసం ఆరాట పడ్డావే?

నీ స్వరం వినడానికి , నీ సెల్ బిల్లు కట్టించావు.. ఎప్పుడూ ఏమో నా తప్పిదం లేదు అని తప్పించుకుంటున్నావు,

నువ్వు గాయపరచినది కేవలం ఒక మగవాడి మనసే కాదు నిన్ను మనసారా ప్రేమించే ఒక మనిషి మనసు అని ఎప్పుడు తెలుసుకుంటావు??

రాజీ

ఏంటో మనసు లో ఈ వేదన,


మరిచిపోవాలని అనుకుంటూనే జ్ఞాపకాలలోకి జారిపోతుంది మనసు,

నడి రేయిలో వెన్నెల రాత్రుల్లో షికార్లు

గంటల కొద్ది సమయాన్నిక్షణాలుగా మార్చేసిన మాటల గలగలలు

మరిచిపోవాల్సింది తననా, తన జ్ఞాపకాలనా అనే ఒక చిన్న సంఘర్షణ

రెంటిని మరచి పోవాలి అని తట్టినప్పుడు మనసుని పిండేసే భావాలు



కళ్ళతో పలకలేని ఎన్నో భావల్ని పలికించడానికి
నా మనసు నేర్చుకున్న కొత్త భాష మౌనం... "రాజీ" పడక తప్పదేమో






వీడలేకపోతున్నాను

జీవితం అంటేనే కొన్ని అనుభవాల సంగమం, నువ్వు కూడా నా జీవితం లో ఒక అనుభవం,

మొదట నిన్ను అంతగా పట్టించుకోలేదు, కానీ రోజులు గడిచే కొద్ది నువ్వు నాలో ఒక భాగం అయ్యావు,

నువ్వు ఎవ్వరికీ నచ్చలేదు కానీ నీతో ఈ బంధం వీడిపోయేది కాదు, చాలా మంది నిన్ను దూరంగా వుంచమన్నారు,

ఎన్నో జాగ్రత్తలు చెప్పారు , ప్రమాదం అన్నారు, అందరికీ నువ్వు పాతపడిపోయావు,

కానీ నాకు మాత్రం నువ్వు ఎప్పటికీ కొత్తే, నీ ప్రత్యేకతలు నీవి,
కొన్ని సార్లు నిన్ను సరిగా చూడలేదు నేను, నువ్వు నాతో వున్నావు అన్న విషయమే మర్చిపోయాను,


నీ నుండి శాశ్వతం గా విడిపోదాము అనుకున్నాను, కానీ మరలా నీ చెంతకే చేరుతాను,

ఇంకా నా వల్ల కాదు,నిన్ను అందరికీ పరిచయం చేస్తాను...
http://picasaweb.google.co.in/paveenp4u/Car#5466584921758159106