10 May 2011

లావణ్యం

                          
బాల్యం లో పరిచయం స్నేహం గా మారక ముందే విడిపోయాయి రెండు మనసులు

ఆ రెండు మనసులు నిజాన్ని విడిచి స్వప్నలోకంలో విహరించాయి,

తేరుకుని చూసేటప్పటికి జీవితాన్నే కోల్పోయాయి,

ఎన్నో వసంతాల తరువాత అనుకోకుండా కలసిన ఆ క్షణం లో

తన పెదవిలో సన్నటి వణుకు ను లీలగా గమనించింది అతని మనసు

తను తిరిగి చేరువవుతుందా అనే ఒక చిన్న ఆశ ఆ మనసులో,

చీకటి లో కూడా వెతుకుతూ ఆ లావణ్యం కోసం...

ఈ నిరీక్షణ ఎన్ని యుగాలైనా కొనసాగుతూనే వుంటుంది...

గతంలోనైనా  లావణ్యం తాలూకు అనుభూతులు మిగులుతాయనే చిన్నిఆశతో...     

03 May 2011

సీమ చింతకాయలు

టివి ప్రపంచం లేని కాలంలో వేసవి వస్తే చాలు, సొంత వూరిలో సెలవల్లో వూళ్ళో వుండే
స్నేహితులతో చేసే సరదా పనుల్లో ఒక ముఖ్యమైన పని బాగా గుర్తు వస్తుంది ఈ రోజు. . .
 
అదే “కొక్కేలు కట్టిన పెద్ద కర్రలు పట్టుకొని సీమచింతకాయల వేటకు బయలుదేరటం”  

ఆ చెట్ల కింద చేరి ఆ కాయలని కోసి వాటిలోని పిక్కలని తినటం అంటే మహా సరదా, మా వూరిలో ఆ చెట్లు స్కూల్ లో నే వుండేవి. . .


పండని దశలో అవి పసరు పసరుగా వున్నా సరే తినటం ఇప్పటి పాతిక వసంతాల వయసున్న కుర్రవాళ్లకు అప్పట్లో బాగా అలవాటే . . .


కాల క్రమంలో ఆ స్నేహలే లెక్కలు కట్టి మాట్లాడే స్థాయికి దిగజారినప్పుడు ఇంకా చెట్లవెంట కాయల వేట సాధ్యమా ?

మరలా ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందో ! ! ! కల్మషం లేని స్వార్ధం లేని స్నేహలు . . .