21 September 2010

తరుణోపాయం - ఒక “సత్తా” కి నా సమాధానం

ఈ మహా నగరం లో చాలా ముఖ్యమైన ప్రదేశం హైటెక్ సిటి, ఎటు చూసినా ప్రపంచ పటంలో చాలా చోట్ల కనిపించే పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు, అందులో పని చేసే ఉద్యోగులు సమయం నిమిషాల్లో కంటే సెకన్ లలోనే పాటిస్తారు...   అలాంటి చోట నాకు ఒక వ్యాపారం చెద్దాము అనే ఆలోచన వచ్చింది...
ప్రతి రోజు మామూలుగా ఆఫీసు కి వెళితే పట్టే సమయం కె పి హెచ్ బి నుండి హైటెక్ సిటి కి ద్విచక్ర వాహనం పైన 20నిమిషాలు , కార్ లో 30నిమిషాలు. కానీ చిరుజల్లు భూమాతను స్పృశిస్తే అప్పుడు బైక్ పైన 40 నిమిషాల నుండి గంట , కార్ లో గంట నుండి గంటన్నర. ఇక్కడ అసలు సమస్య చెప్పాలి, హైటెక్ సిటి రైల్వే స్టేషన్ దగ్గర చిన్న వంతెన వుంది రైలు వెళ్ళటానికి. దాని కింద నుండి వాహనాలు వెళ్లాలి. అంటే రైలు మార్గం దానికి కింద రోడ్ మార్గము రెండు వున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రయాణ మార్గము కావాలి.
అదే జలమార్గము...  ఎందుకంటే అక్కడ చిరు జల్లుకే ఒక చిన్న కాలువ ప్రవహిస్తుంది, అదే కొద్దిగా తేలికపాటి వర్షానికి చిన్న చెరువులా మారిపోతుంది... ఇటు వెళ్ళటానికి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు... వారి వాహనాలు పాడవకుండా వారు ఇంకా వేరే మార్గాల్లో వెళ్ళి సమయం వృధా చేసుకోకుండా నాకు ఒక ఆలోచన వచ్చిoది. దానిని ఆచరణ లో పెడితే వారికి నాకు కూడా సమయం ఆదా చేసిన వాడిని  అవుతాను. ఇంకా చాలా మందికి ఒక కొత్త అనుభూతిని మిగిల్చిన వాడిని అవుతాను...
అదే బల్లకట్టు... ఇక్కడ ఒక బల్లకట్టు పెడితే వర్షానికి ఆ దారి చెరువు అయినప్పుడు అక్కడ ఆ బల్లకట్టు సహాయంతో వాహనల్ని అందులోని మనుషులని అవతలి తీరానికి చేర్చవచ్చు... 
మొన్న పొద్దున అటు వస్తూ నేను ఒక పోస్టర్ చూసాను,


ఈ రోడ్ బాగు చెయ్యటా నికి, ముందుకు వచ్చిన  కె పి హెచ్ బి ఎం ల్  ఏ గారికి ధన్యవాదములు అని,  ఐనా ఆ రోడ్ బాగు చేయించిన తరువాత ఆ ధన్యవాదములు చెప్పాలి కానీ సమస్యని చూడటానికి వచ్చిన వాళ్ళకి కూడా  ధన్యవాదములు చెపుతారా?  


ఆ ఎం ల్  ఏ గారికి ఇన్ని రోజులు ఇటు తిరిగి చూడాలని అనిపించలేదా?   


వర్షానికి ఆతలాకుతలం అవుతుంటే పట్టని వారికి ఈ వర్షాకాలం ఇంకో నెలలో అయిపోతుంటే ఇప్పుడు ఇంత శ్రద్ద ఏమిటో!!!             

2 comments:

  1. మొన్నామధ్య వానలు పడి ఆ వంతెన కింద ఒక పెద్ద నదీమ తల్లి ప్రత్యక్షమైనపుడు అక్కడ ఎయిర్ సెల్ మొబైల్ కంపెనీ వాడు ఒక తెప్ప లాంటి పడవ ఏర్పాటు చేసి "దీన్ని ఉపయోగించండి" అని రాసి పెట్టాడట, నిజమేనా! :-))

    ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఆ బోర్డు పెట్టినందుకైనా తిరిగి చూసాడా లేదా?

    ఆ రోడ్లో వాన లేకపోతేనే సాయంత్రాలు నరకం! ఇక వాన పడితే చెప్పాలా?

    ReplyDelete
  2. మీ స్పందన బాగుంది సుజాత గారు, ఎయిర్ సెల్ వాళ్ళ తెప్ప గురించి నాకు పెద్దగా తెలియదు :):)

    ReplyDelete